దుమ్ముగూడెం మండలం పైడిగూడెం గ్రామానికి చెందిన కణితి సమ్మయ్య అనే వ్యక్తి షార్ట్ సర్క్యూట్ కారణంగా తన ఇంటిని కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర అటవీ శాఖ ఛైర్మన్ పోదేం వీరయ్య మంగళవారం బాధితుడిని పరామర్శించి, ఓ ట్రస్ట్ ద్వారా రూ. 5,000 నగదుతో పాటు నిత్యావసరాలను అందించారు.