గురువారం దమ్ముగూడెం ఎంపీడీవో కార్యాలయం వద్ద సీపీఎం మండల కార్యదర్శి కారం పుల్లయ్య ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై నిరసన తెలిపారు. అంజిపాక పంచాయతీకి 24 ఇళ్లు మంజూరైనా, కేవలం 5 ఇళ్లు మాత్రమే కేటాయించారని, లబ్ధిదారుల ఎంపికపై స్పష్టత ఇవ్వాలని ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. అధికారులు గుర్తిస్తారా లేక నాయకులు గుర్తిస్తారా అని ఆయన ప్రశ్నించారు.