భద్రాచలం పట్టణంలోని ఐటిడిఏకు ఎదురుగా ఉన్న వైఎస్సార్ నగర్ సమీపంలో వైన్ షాపులు, బెల్ట్ షాపులు పెట్టొద్దంటూ ఆదివారం ఫ్లెక్సీలు వెలిశాయి. బడి, గుడి, ట్రైబల్ మ్యూజియం వంటి ప్రధానమైనవి ఉన్న ఈ ప్రాంతంలో భక్తులు, విద్యార్థులు, పర్యాటకులు నిత్యం సంచరిస్తారని, కాబట్టి వైన్ షాపులను నివారించాలని స్థానికులు కోరుతున్నారు. వ్యాపారులు మానవతా దృక్పథంతో ఆలోచించాలని, అధికారులు చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ నగరవాసులు నినదిస్తున్నారు.