స్టార్ చిల్డర్ హైస్కూల్లో ఘనంగా అసెన్షన్ మెడిటేషన్ డే వేడుకలు

పాల్వంచలోని స్టార్ చిల్డర్ హైస్కూల్లో గురువారం ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో అసెన్షన్ మెడిటేషన్ డే ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి శ్రీమతి కే సుధా దేవి ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచి, ప్రేమతో జీవించడం నేర్పుతుందని, ఏకాగ్రత, సానుకూల దృక్పథం, మానవతా విలువలు పెంపొందించడంలో ధ్యానం కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు సామూహిక ధ్యాన సాధన చేశారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ జి భాస్కర్ రావు, ప్రిన్సిపాల్ జి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్