పాల్వంచ పట్టణానికి సమీపంలోని వాగు నుంచి అక్రమార్కులు పట్టపగలే ఐదు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని వనమా కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ రవాణాపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, అడ్డదారిలో సొమ్ము చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.