జూలూరుపాడు: అమరవీరుల స్తూపం వద్ద జెండా ఆవిష్కరణ

జూలూరుపాడు మండలం అమరవీరుల స్తూపం వద్ద సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ సోమవారం జెండా ఆవిష్కరణ చేసింది. పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు ఎస్కే ఉమర్ మాట్లాడుతూ అమూల్యమైన ప్రాణాలతో ఎరుపెక్కించిన ఎర్రజెండా సాక్షిగా అమరవీరుల ఆశయాల సాధనలో పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్