కొత్తగూడెం: ఉరి వేసుకుని వ్యక్తి బలవన్మరణం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో శనివారం ఉదయం అన్నమునేని శ్రీను (45) అనే వ్యక్తి మామిడి తోటలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయ్యర్ గారి హోటల్ పక్కన కూరగాయల దుకాణంలో పనిచేసే శ్రీను, ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెంకు చెందినవాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు.

సంబంధిత పోస్ట్