ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి తోలెం మమత, జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పాల్వంచ పట్టణంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జిల్లాలోని వెనకబడిన ఆదివాసి గ్రామాల్లో అనేక కుటుంబాలు ఒకే ఇంట్లో నివాసం ఉంటూ ఇబ్బందులు పడుతున్నాయని, అలాంటి వారికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు అందించాలని కోరారు.