ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు సమీపంలోని గడ్డిపాడుకు చెందిన దివ్యాంగుడైన మహమ్మద్ నూర్ అలీఖాన్, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి సారపాకలో సినిమా పాటలకు నృత్యాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా చిరంజీవి పాటలకు ఆయన చేసే నృత్యాలు, తనదైన శైలిలో చెప్పే డైలాగులు, హావభావాలు అందరి మన్ననలు పొందుతున్నాయి. చిన్ననాటి నుంచే పోలియోతో బాధపడుతున్న నూర్ అలీఖాన్ వివాహితుడు, ఒక బాబు తండ్రి అని తెలిపారు.