పినపాక: ఉపాధి హామీ కార్డుకు ఈకేవైసీ తప్పనిసరి: ఏపీవో

జాతీయ ఉపాధి హామీ పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని ఏపీఓ వీరభద్ర స్వామి సూచించారు. మంగళవారం పినపాక మండలం ఈ బయ్యారం, జానంపేట, సీతంపేట, ఎలిసిరెడ్డిపల్లి గ్రామాలలో ఉపాధి హామీ కార్డుకు ఈ-కేవైసీ కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ఈ-కేవైసీ చేయని వారికి ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్