ఆళ్లపల్లిలో మూడో విడత నామినేషన్ల ప్రారంభం

ఆళ్లపల్లి మండలంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. మండలంలోని 12 గ్రామ పంచాయతీలు, 90 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల సౌకర్యార్థం ఆళ్లపల్లి, మర్కోడు గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోటీదారులు ఎన్నికల నియమావళిని అనుసరించి నామినేషన్లు దాఖలు చేయాలని ఎంపీడీవో డి. శ్రీను తెలిపారు.

సంబంధిత పోస్ట్