ఇల్లందు: అకాలవర్షంతో తడిసిన ధాన్యం కొనాలని ర్యాలీ

అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఇల్లందు పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అన్ని రకాల పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, కొమరారం గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, తడిచిన ధాన్యం కొనాలని సంఘం నాయకులు తహశీల్దార్ రవికుమార్కు వినతి పత్రం అందించారు.

సంబంధిత పోస్ట్