TG: సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వేల కోట్లు కొల్లగొట్టిన వ్యక్తి కేటీఆర్ అంటూ ఆరోపించారు. డబ్బు కోసం చెల్లినే ఇంటి నుంచి తరిమేశారని, కొల్లగొట్టిన డబ్బులో కొంత భాగం చెల్లికి ఇవ్వొచ్చు కదా అంటూ పేర్కొన్నారు. బీఆర్ఎస్ వాళ్లు ఏమని ఓట్లు అడుగుతున్నారని, పీజేఆర్ చనిపోతే ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు కూడా ఆనాడు మద్దతు ఇచ్చాడని గుర్తు చేశారు. కానీ, కేసీఆర్ మాత్రం అభ్యర్థిని నిలబెట్టి ఏకగ్రీవం కాకుండా అడ్డుకున్నారని అన్నారు.