వేయిస్తంభాల ఆలయంలో లక్ష దీపోత్సవం

హనుమకొండ చౌరస్తాలోని చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా లక్ష వత్తులతో లక్ష దీపోత్సవం జరిగింది. తెల్లవారుజాము నుంచి రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. సుమారు 30వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ప్రమిదలు, వత్తులు, నూనెతో దీపోత్సవం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్