జమ్ముకశ్మీర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై నార్సు ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే కొండచరియలు పడటంతో కొండ కింద ఉన్న భవనం కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండటంతో ఇప్పటికే స్థానికులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.