జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థిని అధిష్టానం ప్రకటించింది. లంకల దీపక్‌రెడ్డి పేరును అధికారికంగా అనౌన్స్ చేసింది. కీర్తీ రెడ్డి, పద్మా వీరపునేని, ఆలపాటి లక్ష్మీనారాయణ, ఆకుల విజయ, కొంపల్లి మాధవి టికెట్ కోసం పోటీ పడినా.. చివరికి దీపక్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. కాగా దీపక్ రెడ్డి 2023లోనూ బీజీపీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ లో పోటీ చేశారు. ప్రస్తుతం దీపక్ హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షుడిగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్