వరి రైతులు ఆకు ఎండు తెగులతో ఇబ్బందులు పడుతున్నారు. డెల్టా ప్రాంతంలోని వరి పంటలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా సెప్టెంబరు నెలలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. దీని వల్ల క్రమంగా వరి ఎండిపోతుంది. దీని నుంచి బయటపడాలంటే నత్రజని ఎరువులు నిలిపివేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్లాంటామైసిన్ 80 గ్రాములు లేదా స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ 40 గ్రాములు ఎకరానికి పిచికారీ చేయాలి.