ఢిల్లీ ఎన్సీఆర్‌లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్నందున బాణసంచా విక్రయాలపై ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అయితే, దీపావళి పండుగను పిల్లలు ఆనందంగా జరుపుకోవడానికి, పర్యావరణహిత బాణసంచాను రెండు గంటల పాటు (రాత్రి 8-10) కాల్చడానికి అనుమతివ్వాలని ఎన్సీఆర్ రాష్ట్రాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధన సంస్థ ఆమోదించిన బాణసంచాను మాత్రమే విక్రయించాలని, అత్యధిక పేలుడు టపాసులను అలాగే ఆన్‌లైన్‌లో బాణసంచా అమ్మకాలను నిషేధించాలని సుప్రీంకోర్టు సూచించింది.