నిమిషాల్లో ఎస్‌ఎంఈలకు రూ.5 కోట్ల వరకు రుణం: SBI ఛైర్మన్‌

డిజిటలీకరణ భారత్‌లో ఫైనాన్షియల్‌ రంగ రూపురేఖలను మార్చిందని ఎస్‌బీఐ ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. చిన్న, మధ్యతరహా సంస్థలకు ఇప్పుడు కేవలం 25–26 నిమిషాల్లో రూ.5 కోట్ల వరకు రుణం ఆమోదం లభిస్తోందన్నారు. గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ 2025లో బుధవారం ఆయన మాట్లాడుతూ, ఎస్‌బీఐ ద్వారా 15 కోట్ల జన్‌ధన్‌ ఖాతాలు తెరవగా, వాటిలో 99.5% ఖాతాల్లో నిల్వలు ఉన్నాయని చెప్పారు. యోనో యాప్‌ను అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్