యూపీలోని సోన్‌భద్ర జిల్లాలో దారుణం జరిగింది. పర్సోయి అనే గ్రామంలో భార్యభర్తలు చేతబడి చేస్తున్నట్లు స్థానికులు అనుమానించారు. దీంతో వారిని కొట్టి చంపారు. బాబులాల్ ఖర్వార్(57), రాజ్‌వంతి(52) దంపతులు. ఈ భార్యాభర్తలు కలిసి తమ గ్రామంలో చేతబడి చేస్తున్నట్లు స్థానికులు అనుమానించారు. దీంతో గురువారం సాయంత్రం గులాబ్ అనే వ్యక్తి మరికొందరు గ్రామస్థులను వెంటబెట్టుకొని ఆ దంపతుల ఇంటికి వెళ్లి ఆయుధాలతో దాడి చేశారు. దీంతో రాజ్‌వంతి మృతి చెందగా.. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.