కారును ఢీకొట్టిన లారీ.. ముగ్గురికి గాయాలు

TG: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఓ కారును లారీ ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో డ్రైవర్ తో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్