TG:సంగారెడ్డి జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మహబూబ్‌సాగర్ చెరువు కట్ట వద్ద ఏఆర్ కానిస్టేబుల్ సందీప్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసై, భారీగా డబ్బులు పోగొట్టుకోవడమే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన సందీప్, సంగారెడ్డి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏడాదిగా విధులు నిర్వహిస్తున్నాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి, ఆత్మహత్యపై విచారణ చేపట్టనున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.