పాన్ కార్డ్ తో బ్యాంకింగ్, ఐటీ రిటర్న్స్ ఆర్థిక ప్రక్రియలు చేస్తుంటాం. పాన్ కార్డు పోగొట్టుకుంటే ఏం చేయాలో తెలుసా? మొదటిగా సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. ఇలా చేస్తే చట్ట విరుద్ధమైన కార్యకలాపాల నుంచి రక్షణ పొందుతారు. అనంతరం డూప్లికేట్ పాన్ కార్డ్ కోసం NSDL లేదా UTITSL వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మీ వివరాలు నమోదు చేసి రుసుము చెల్లిస్తే పాన్ కార్డు పొందవచ్చు.