AP: సూర్య, చంద్ర గ్రహణం సమయంలో దేశంలోని ఆలయాలు మొత్తం దాదాపు మూతపడుతాయి. కానీ శ్రీ కాళహస్తి ఆలయంలో మాత్రం ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. దీనికి ప్రధాన కారణం శ్రీ కాళహస్తి ఆలయంలో నవగ్రహ కవచం ఉందని, దాని వల్ల దైవశక్తి క్షీణించదని చెబుతున్నారు. అయితే మాములుగా గ్రహణ కాలంలో అత్యంత శక్తివంతమైన కిరణాలు విడుదలవుతాయని, ఆ కిరణాలు గోపురాల్లో ఉండే కాస్మిక్ ఎనర్జీపై ప్రభావం చూపి దైవ విగ్రహాల్లో ఉండే శక్తిని హరిస్తుందని పండితులు తెలుపుతున్నారు.