ఆన్‌లైన్ డెలివరీ యాప్‌ల ద్వారా వినియోగదారులు మోసపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, వినీత్ అనే వ్యక్తి స్విగ్గీలో వెండి నాణేలు ఆర్డర్ చేస్తే, బదులుగా మ్యాగీ నూడుల్స్, హల్దిరామ్ ప్యాకెట్లు డెలివరీ అయ్యాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డెలివరీ ఆప్షన్లలో ఒకటైన సీల్డ్ పౌచ్ తెరిచి చూడగా, అందులో 925 స్టెర్లింగ్ సిల్వర్ నాణేలు ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనపై స్విగ్గీ స్పందించి, వినియోగదారుడి నుంచి ఆర్డర్ ఐడీని సేకరించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.