TG: ఖైరతాబాద్ మహావినాయకుడి శోభాయాత్ర వేలాది భక్తజనం మధ్య వైభవంగా సాగింది. తెలంగాణ సచివాలయం వద్దకు చేరుకోగానే అద్భుతమైన పరిపాలనా భవనం ఓవైపు.. ఎత్తైన ఖైరతాబాద్ గణనాథుడు నిలబడిన దృశ్యం మరోవైపు ఆకట్టుకుంది. ఈ అద్భుత దృశ్యం చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది. 'గణపతి బప్పా మోరియా' అనే నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.