దేవరకద్ర నియోజకవర్గం, చిన్న చింతకుంట మండలం, అమ్మాపూర్ శివారులో బుధవారం మధ్యాహ్నం ఇనుప సామాన్లు ఏరుకునే మల్లేష్ (30) అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు నర్వ మండలం, చిన్నకడుమూరుకి చెందిన బుచ్చన్న కుమారుడిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాల కోసం బంధువులు సంప్రదించాలని చిన్నచింతకుంట ఎస్ఐ ఓబుల్ రెడ్డి కోరారు.