శనివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జిఎంఆర్) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎర్రగడ్డ డివిజన్‌లోని శాస్త్రినగర్, కల్పతరు అపార్ట్‌మెంట్లలో ఆయన మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మూడా చైర్మన్ వెంకట్రామిరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.