దేవరకద్ర: హైమాస్ట్ లైట్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

దేవరకద్ర నియోజకవర్గం ముసాపేట మండలం సంకలమద్దిలో సోమవారం పోచమ్మ తల్లి, బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, కొమిరెడ్డిపల్లి గ్రామంలో హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతులకు, గ్రామీణ అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్