మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం అమ్మాపురం కురుమూర్తి జాతరలో మైనర్లకు అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం అలవాటు పడిన మైనర్లు రాత్రి వేళల్లో గుంపులుగా చేరి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి వరకు మద్యం, మాంసం విక్రయం జరుగుతోందని, జాతర మైదానంలో పోలీసు గస్తీని పెంచాలని ప్రజలు కోరుతున్నారు.