మహబూబ్ నగర్: విద్యార్థులకు 'ఆపార్ ఐడీ' 100% పూర్తి చేయాలి

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులకు 'ఆపార్ ఐడీ' (Apar ID) జనరేషన్ ను వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పోలీస్ లైన్ స్కూల్ లను కలెక్టర్ సందర్శించి, ఆపార్ ఐడీ జనరేషన్ ను పరిశీలించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులందరికీ ఆపార్ ఐడీలు తప్పనిసరిగా జనరేట్ చేయాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్