కూలీ పని కోసం హైదరాబాద్ వెళ్లి, గత నెల 27న ఇంటికి బయలుదేరిన కర్నూలు జిల్లా ప్రకాష్ నగర్ కు చెందిన మద్దిలేటి, మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవల్లి మండలం జోగులాంబ రైల్వే హాల్ట్ సమీపంలో మృతి చెందాడు. మృతదేహం లభ్యం కాగా, అతని వద్ద ఉన్న ఆధారాల ద్వారా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. షుగర్ తదితర అనారోగ్య సమస్యలతో మృతి చెంది ఉండవచ్చని అతని భార్య మద్దమ్మ పోలీసులకు తెలిపింది.