సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ రాజకీయ నాయకులను, వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఫోన్ ను హ్యాక్ చేశారు. తన మొబైల్ నుంచి వచ్చే ఎలాంటి సందేశాలకు స్పందించవద్దని ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యే ఫోన్ నంబర్ నుంచి డబ్బులు అడిగితే స్పందించకుండా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయాలని ఆయన పేర్కొన్నారు.