గద్వాల జిల్లాలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం..!

జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ధర్మవరం బీసీ వసతి గృహంలో ఘటన మరవకముందే, అదే మండలంలోని ఎస్సీ గురుకులంలో మరో సంఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం అల్పాహారం తీసుకున్న ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్