గద్వాల: హోటల్ భోజనంలో ఈగ.. యజమాని నిర్లక్ష్యం

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని భాగ్యలక్ష్మి భోజన హోటల్‌లో కలుషిత భోజనం అందిస్తున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని యజమానిపై విమర్శలు వస్తున్నాయి. మంగళవారం ఒక కస్టమర్ ప్లేట్‌లో ఈగ కనిపించడంతో, యజమాని నిర్లక్ష్యంగా స్పందించి, 'ఈగను పక్కకు పెట్టు లేదా కొత్త ప్లేట్‌లో తిను' అని చెప్పడం గమనార్హం. 'ఇంతమందికి లేని సమస్య నీ ఒక్కనికే ఎందుకు?' అని దురుసుగా మాట్లాడినట్లు బాధితుడు తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న యజమానిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు, కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్