గద్వాల: లొంగిపోయిన మోస్ట్‌వాంటెడ్‌ మావోయిస్టు

మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్‌ సుజాతక్క తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. గద్వాల ప్రాంతానికి చెందిన ఆమె, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలు. పశ్చిమబెంగాల్‌లో 2011లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్‌జీ భార్య సుజాతక్క. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ సౌత్‌ సబ్‌ జోనల్‌ బ్యూరో ఇన్‌ఛార్జిగా ఉన్నట్లు సమాచారం. సుజాతక్కపై 106 కేసులున్నాయి మరియు ఆమెపై రూ.కోటి రివార్డు ఉంది.

సంబంధిత పోస్ట్