జోగులాంబ గద్వాల జిల్లాలో బంగారం కోసం దారుణ హత్య కలకలం రేపింది. షేరెల్లి వీధిలో ఒంటరిగా ఉన్న మహిళను దోపిడీదారులు హత్య చేశారు. పోలీసులు ఇది సాధారణ దొంగతనం కాకుండా ప్రణాళికాబద్ధమైన నేరమని అనుమానిస్తున్నారు. బంగారంపై అత్యాశతో నిందితులు ముందుగా రహస్యంగా రేకీ చేసి, మహిళల కదలికలను గమనించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో పట్టణ మహిళల్లో భయాందోళన నెలకొంది. బంగారం ప్రాణాల బలి తీస్తున్నదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.