BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరో 500 రోజులు ఓపికతో ఉంటే కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, ఈ దుర్మార్గుల పాలనను అనుభవిస్తే చాలని అన్నారు. నాయకులను, కార్యకర్తలను పార్టీని నడిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవంబర్ 14న మాగంటి సునీత గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను ఓడించి ప్రజల బలం చూపించాలని, అన్ని హామీలు పక్కన పెట్టి బెదిరింపులతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్చార్జులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.