మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నసురుల్లాబాద్ గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. జడ్చర్ల నుంచి అమ్మపల్లి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వెంకటేష్ ను, ఆవంచ వైపు నుంచి వస్తున్న ఆటో ఢీకొంది. గ్రామస్థుల కథనం ప్రకారం, బాధితుడిని వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.