జడ్చర్ల: అరబిందో ఫార్మాపై పీసీబీ తనీఖీలు

జడ్చర్ల నియోజకవర్గం పోలేపల్లి సెజ్ లోని అరబిందో ఫార్మా కంపెనీ వ్యర్థ జలాల విడుదలపై ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో శనివారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) బృందం కంపెనీని తనిఖీ చేసి, వ్యర్థజలాల శాంపిళ్లను సేకరించింది. కంపెనీ వ్యర్థాలతో తమ పంట పొలాలు కాలుష్యకారకంగా మారాయని రైతులు ఫిర్యాదు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నారు. శాంపిళ్లను ల్యాబ్ లో పరీక్షించి తదుపరి చర్యలు తీసుకుంటామని పీసీబీ ఈఈ సురేష్ బాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్