మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి శనివారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో దసరా పండుగ సందర్భంగా ఆశా కార్యకర్తలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పండుగ వేళ ఆడపడుచులను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో తన సొంత ఖర్చులతో ఈ చీరలను అందిస్తున్నట్లు తెలిపారు. ఆడపడుచులను సముచితంగా గౌరవించుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.