పాలమూరు వర్సిటీకి మరో గౌరవం

పాలమూరు విశ్వవిద్యాలయం విద్యా విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.శ్రీనివాస్, 'వాలీబాల్ ప్లేయర్స్ పై డాటా డ్రీవన్ మానిటరింగ్ సిస్టం' అనే అంశంపై ఒక యుటిలిటీ పేటెంట్ ను పొందారు. ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పూస రమేష్ బాబు ఆయనను అభినందించారు. నూతన ఆవిష్కరణలలో మరింత చురుకుగా పాల్గొనాలని వీసీ డాక్టర్ శ్రీనివాస్ ను కోరారు. ఈ ఆవిష్కరణ వాలీబాల్ క్రీడాకారుల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

సంబంధిత పోస్ట్