మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో గత 24 గంటల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా నవాబుపేటలో 30.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా, మిడ్జిల్ మండలం దోనూరులో 21.8, జడ్చర్ల 8.5, మహబూబ్నగర్ రూరల్ 4.8, అడ్డాకుల 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.