మహబూబ్ నగర్: బంగారం దుకాణంలో దొంగల బీభత్సం

మహబూబ్ నగర్ పట్టణంలోశనివారం ఉదయం మహాలక్ష్మి జూవెలర్స్లో షాపు వెనుక గోడకు రంధ్రం చేసి లాకర్లలోని 7 కేజీల వెండి, తులంన్నర బంగారం, రూ.30 వేల నగదును దొంగలు దోచుకెళ్లారు. పక్కనే ఉన్న పానీపూరి షాపులో రూ.6 వేలు ఎత్తుకెళ్లారు. షాపు యజమానులు తెరిచి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్