అచ్చంపేట: మానవత్వం చాటుకున్న అటవీశాఖ సిబ్బంది

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగర్ కర్నూలు జిల్లా నల్లమల లోతట్టు ప్రాంతం లింగాల మండల పరిధిలోని అప్పాపూర్ పెంటకు చెందిన ఆదివాసీ మహిళ పురిటి నొప్పులతో బాధపడింది. అటవీ శాఖ అధికారి కే. శిల్ప, గురువయ్యలు, జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి, మన్ననూరు అటవీశాఖ క్షేత్ర అధికారి వీరేష్ సూచనలతో సఫారీ వాహనం ద్వారా గర్భిణీని మన్ననూరుకు తరలించి, అక్కడి నుంచి 108 వాహనం ద్వారా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. వర్షాల కారణంగా 108 వాహనం వెళ్లలేని పరిస్థితిలో అధికారులు సకాలంలో స్పందించి గర్భిణీకి సహాయం అందించారు. బాధిత మహిళా కుటుంబ సభ్యులు అటవీ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్