నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో మాజీ మంత్రి కేటీఆర్ సభ నేపథ్యంలో ఆదివారం వర్షం వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా జర్మనీ వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు. గత వారం రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున, సభా స్థలికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. అచ్చంపేటలో పూర్వ వైభవం తీసుకురావాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు.