అచ్చంపేట: SLBC ప్రపంచంలోనే అద్భుత ప్రాజెక్టు: సీఎం

దేశంలోనే SLBC అత్యుత్తమ ప్రాజెక్టు అని, 44 కి.మీ. టన్నెల్ ప్రపంచంలో మరెక్కడా లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణకు మంచి పేరు రావడంతో పాటు, నయా పైసా ఖర్చు లేకుండా గ్రావిటీతో నీటిని సరఫరా చేయొచ్చని తెలిపారు. గత ప్రభుత్వం దీనిని పూర్తి చేయడంలో విఫలమైందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్