అచ్చంపేటలో బాలిక కిడ్నాప్ యత్నం.!

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలోని కన్యకా పరమేశ్వరి దేవాలయం సమీపంలో సోమవారం రాత్రి ఆరేళ్ల బాలికను ఓ అగంతకుడు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు. స్థానికులు గుర్తించి కేకలు వేయడంతో ఆ వ్యక్తి చిన్నారిని వదిలి పారిపోయాడు. ఈ ఘటనపై మంగళవారం బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అగంతకుడి ఆచూకీ తెలిస్తే 8712657732, 8712657733 నెంబర్లకు తెలియజేయాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్