నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో సాయంత్రం ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. కల్వకుర్తి పట్టణంతో పాటు ఎంగంపల్లి, మార్చాల గ్రామాలలోనూ వర్షం కురిసింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కంది, మొక్కజొన్న, పత్తి వంటి వివిధ పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.