ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని పలు గ్రామాలలో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లోనే పత్తి తడిసిపోవడంతో రైతులు పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 15 క్వింటాళ్లకు పైగా దిగుబడి ఆశించిన చోట, అధిక వర్షాల వల్ల దిగుబడి గణనీయంగా తగ్గిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.